ఈ కరోనా మహమ్మారి చాలా రంగాలని ఇబ్బందులకి గురిచేసింది, అంతేకాదు చాలా మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు, కొందరు వ్యాపారాలు ఉద్యోగాలు లేక కూలీకి కూడా వెళుతున్నారు, చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఢిల్లీ, జీబీ రోడ్డులోని చాలామంది సెక్స్ వర్కర్ల జీవితంలోనూ కరోనా పెను మార్పులు తీసుకువచ్చింది.
వారు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పది నుంచి రాత్రి పది వరకూ విటుల కోసం చూస్తారు, వారు ఇచ్చే రెండు వందలు ఐదువందల కోసం పది గంటలు అలా ఉంటారు, అయితే ఇద్దరు ముగ్గురు విటులు వస్తే వెయ్యి రూపాయలు వస్తాయి అని ఆశతో ఆ వేశ్యలు అక్కడ ఉంటారు, ఈ కరోనాతో ఎవరూ వారి దగ్గరకు రాలేదు, దీంతో తినడానికి కూడా వారికి కష్టమైంది.
కరోనా కారణంగా వేశ్యా వృత్తి తీవ్రంగా నష్టపోయింది. దీంతో వారు వేరే ఉపాది వెతుక్కోక తప్పలేదు. ఇదే మంచి సమయం అని వారు మట్టి దీపాలకు రంగులు వేయటం, కాగితపు బ్యాగులు తయారు చేయటం, అగరుబత్తీలు, కీ రింగుల తయారీ, ఫ్యాబ్రిక్ పనుల్లో శిక్షణ తీసుకున్నారు.
జీబీ రోడ్డులో పడుపు వృత్తి కొనసాగిస్తున్న 2000 మంది వేశ్యల్లో దాదాపు 20 శాతం మంది లాక్డౌన్ సమయంలో ఈ వృత్తుల వల్ల ఉపాధి పొందుతున్నారు.ఇక ఈ పని మానేసి ఇలా చేతి వృత్తి చేసుకుంటాం అని అంటున్నారు చాలా మంది, ఈ కరోనా వీరిలో చాలా మార్పు తీసుకువచ్చింది.