ఒక్కో ప్రాంతంలో కొన్ని కండిషన్స్ నిబంధనలు అక్కడ గ్రామాలు ఆ గ్రామ పెద్దలు పెడుతూ ఉంటారు, అయితే అవి అక్కడ నివసించే ప్రజలు అందరూ పాటించాలి.కాదు అని ఎదురు తిరిగితే గ్రామం నుంచి బహిష్కరిస్తారు, లేదా వారికి జరిమానా శిక్ష విధిస్తారు, కాని ఈ ఫత్వా గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ముస్లిం ప్రాబల్య గ్రామ కమిటీ సంచలన ఫత్వా జారీ చేసింది. గ్రామంలో ఎవరైనా టీవీ చూసినా, క్యారమ్స్ ఆడినా, మద్యం, లాటరీ టికెట్లు కొన్నా, మ్యూజిక్ విన్నా జరిమానా తప్పదంటూ ఫత్వాలో హెచ్చరించింది. దీని గురించి అక్కడ బ్యానర్లు ఏర్పాటు చేశారు.
మరి దేనికి ఎంత శిక్ష అనేది కూడా ఇచ్చారు, అంతేకాదు జరిమానాలతో పాటు చెవులు పట్టుకుని గుంజీలు తీయడం, శిరోముండనం వంటి శిక్షలు కూడా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
టీవీ చూసినా మొబైల్ వాడినా కంప్యూటర్ లో మ్యూజిక్ విన్నా 1000 ఫైన్
లాటరీ అమ్మితే 2 వేలు
క్యారమ్స్ ఆడితే 500
లాటరీ టికెట్లు అమ్మితే రూ. 7 వేలు
మద్యం అమ్మితే రూ. 7 వేల జరిమానాతోపాటు శిరోముండనం చేసి గ్రామంలో ఊరేగింపు
మద్యం తాగితే 2 వేల జరిమానా,పది గుంజీలు
గంజాయి కొంటే రూ. 7 వేలు
ఇలా చేసేవారి గురించి సమాచారం ఇస్తే 200 నుంచి 2000 అందిస్తారు వారికి