డ్రైవింగ్ లైసెన్స్ చాలా మంది తీసుకుంటారు, అయితే ఈ రూల్స్ కూడా కచ్చితంగా మీరు తెలుసుకోవాలి, తాజాగా కొత్త రూల్ అయితే తీసుకువస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక విషయాన్ని వెల్లడించింది. మీరు కారు లేదా ఫోర్ వీలర్ ఏది నడిపినా కచ్చితంగా రివర్స్ గేర్లో వెహికల్ను నడుపవలసి ఉంటుంది. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అంటే కచ్చితంగా రివర్స్ గేర్ లో దీనిని నడపాల్సిందే.
అయితే అది కూడా ఇష్టం వచ్చినట్లు కాదు టెస్ట్ ఫెయిల్ అవ్వకుండా నడపాలి… ఒకవేళ ఫెయిల్ అయినా ఇష్టం వచ్చినట్లు నడిపినా మీకు లైసెన్స్ రాదు… తాజాగా రోడ్డు మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు… సో కొత్తగా ఎవరైనా లైసెన్స్ తీసుకోవాలి అంటే కచ్చితంగా ఇది చేయాల్సిందే.
ఆ వెహికల్ కు రివర్స్ గేర్ ఉంటే.. అప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కు వచ్చిన వారు కచ్చితంగా రివర్స్ గేర్ను ఉపయోగించాల్సి ఉంటుంది…. ఇక కచ్చితంగా ఇది పాస్ అవ్వాల్సిందే అని తెలియచేశారు. ఇప్పటికే ఆన్ లైన్ లో రవాణాశాఖ పలు సర్వీసులు ఇస్తున్న సంగతి తెలిసిందే.
ReplyForward
|