ఇళ్లపట్టాల పంపిణీకి మరో డేట్ ఫిక్స్ చేసిన వైసీపీ సర్కార్…

ఇళ్లపట్టాల పంపిణీకి మరో డేట్ ఫిక్స్ చేసిన వైసీపీ సర్కార్...

0
91

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో అత్యంత కీలకమైన సంక్షేమ పథకం ఇళ్ళపట్టాల పంపిణీ అని చెప్పుకొచ్చారు… ఈ పథకాన్ని అమలు చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా పలు కారణాలతో వెనకడుగుపడుతోంది…

తాజాగా ఈ పథకం మరోసారి వాయిదా పడబోతున్నట్లు తెలుస్తోంది… నిజానికి దివంగత వైఎస్ జయంతి రోజు పురస్కరించుకుని ఈనెల 8వతేదీని ఇళ్లపట్టాల పంపిణీ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది… కానీ కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల కారణంగా స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి…

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఇప్పటికే 90 శాతం పరిష్కరించిన ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలాంటి పొరపాట్లు జరుగకుండా జాబితాలను సిద్దం చేయడం జరిగింది… అయితే కరోనా కారణంగా ఇప్పటికి తాత్కాలికంగా వాయిదా తప్పలేదు…