తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీనితో ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఆమెను ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు.