Breaking: సీఎం కేసీఆర్ కు అస్వస్థత..యశోద ఆసుపత్రిలో చేరిక!

0
65

తెలంగాణ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం అందుతుంది. ఉదయం నుంచి కాస్త అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్… హుటాహుటిన యశోదా ఆసుపత్రికి వెళ్లారు. సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రికి వెళ్లనున్నారని నిన్న ప్రగతి భవన్ అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. అయితే సీఎం కేసీఆర్ కు అస్వస్థత నెలకొన్న నేపథ్యంలో ఆ టూర్ వాయిదా పడింది. సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరడంపై టిఆర్ఎస్ పార్టీ నేతలు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.