టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అధికారంలో ఉన్న తెరాస పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ను సమయం దొరికినప్పుడల్లా తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. అధికార పార్టీ అవినీతిని ఎండగడుతూ నిత్యం ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను తీసుకెళ్లారు. తాజాగా TRS ప్రభుత్వ పాలనలో పెరుగుతున్న నిత్యావసర ధరలపై పీసీసీ చీఫ్ మండిపడ్డారు.
2014, 2022లో ధరల మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ గా మారింది. తెరాస పాలనలో సామాన్యుడికి నిత్యమంట అని రేవంత్ క్యాప్షన్ కూడా పెట్టారు. అంతేకాదు ఈ ఫొటోలో కేసీఆర్ పాలనలో కాలే కడుపులు..ఆకలితో అలమటిద్దామా? ఈ అసమర్ధుణ్ణి సాగనంపుదామా అంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత తెరాస పాలనలో ఉన్న ధరల మధ్య వ్యత్యాసాన్ని ఈ ఫొటోలో చూపించారు. మండే మంట దగ్గరనుండి వండే వంట వరకు కేసీఆర్ పాలనలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల ఇలా ఉన్నాయని పోస్ట్ పెట్టారు రేవంత్ రెడ్డి.