దాదాపు చైనాకి చెందిన 50కి పైగా యాప్స్ భారత్ లో నిషేదించారు… ఇక రెండు మూడు రోజుల్లో అవి కనిపించవు.. అయితే సేమ్ ఇవి వాడటం అలవాటు అయ్యాయి అని మరి వాటిలా మరే యాప్స్ అయినా ఉన్నాయా అని చాలా మంది గూగుల్ చేస్తున్నారు.. సో ఆ యాప్స్ లాంటి మరికొన్ని యాప్స్ చూద్దాం.
టిక్‌టాక్ ప్రత్యామ్నాయం యాప్ గా చాలా ఉన్నాయి ముఖ్యంగా . టిక్‌టాక్‌తో పాటు విగో వీడియో, లైక్, హెలో యాప్‌ల పైనా నిషేధం పడింది.. ఇక మీరు వాడాలి అంటే డబ్ స్మాష్ చాలా పాపులర్.. మీరు రొపొసొ, డబ్ స్మాష్, పెరిస్కోప్‌లాంటి వాటిని కూడా వాడచ్చు
వీడియో కాన్ఫరెన్స్ అంటే జూమ్ యాప్‌ను తెగ వాడుతున్నారు. మన దేశంలో అభివృద్ది చేసిన సే నమస్తే యాప్‌ను ట్రై చేయొచ్చు. గూగుల్ మీట్, స్కైప్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ డుయో, వాట్సాప్ కాల్ లాంటివి వాడుకొవచ్చు.
షేర్ ఇట్ఇది కూడా చైనా యాపే కావడంతో కేంద్రం నిషేధించింది. ..షేర్ ఫైల్స్’, ‘ఫైల్స్ బై గూగుల్’ ఫైల్ షేరింగ్ యాప్‌లు ఉన్నాయి. వీని ద్వారా ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్, యాప్స్ ఒకరి నుంచి మరొకరికి పంపుకోవచ్చు. షేర్‌ఇట్‌తో పాటు జెండర్ లాంటి యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా గూగుల్‌కు చెందిన ఈ యాప్స్‌ను వాడుకోవచ్చు.
యూసీ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయం ఇదే..గూగుల్ క్రోమ్, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ లాంటి బ్రౌజర్లు ఎలాగూ ఉన్నాయి….యూక్యామ్, బ్యూటీక్యామ్, బ్యూటీ ప్లస్ యాప్‌లు చైనావి కావడంతో వాటిపై కూడా భారత ప్రభుత్వం నిషేధించింది. వీటి స్థానంలో పిక్స్ ఆర్ట్, అడొబ్ ఫొటోషాప్, లైట్ రూమ్, గూగుల్ స్నాప్‌సీడ్, బీ612 యాప్స్‌ను వాడండి.