భార‌త్ కు చైనా కంపెనీ అలీబాబా భారీ సాయం ఏం ఇచ్చిందంటే ?

భార‌త్ కు చైనా కంపెనీ అలీబాబా భారీ సాయం ఏం ఇచ్చిందంటే ?

0
95

మ‌న దేశంలో క‌రోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది… ఈ స‌మ‌యంలో అతి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని ప్ర‌భుత్వం కూడా చెబుతోంది.. అందుకే ఏప్రిల్ 14 వ‌ర‌కూ లాక్ డౌన్ ప్ర‌క‌టించారు. అయితే మ‌న దేశంలో క‌రోనా కట్డడికి పీఎం విరాళాలు ఇవ్వాలి అని కోరారు, ఈ స‌మ‌యంలో చాలా మంది పెద్ద మ‌న‌సుతో కోట్ల రూపాయ‌ల విరాళాలు ప్ర‌క‌టించారు.

తోచిన సాయం చేస్తున్నారు.. మ‌రికొంద‌రు ఔష‌దాలు వెంటిలేటర్లు మందులు డాక్ట‌ర్ల కిట్స్ ఇలా అనేక ర‌కాల సాయం చేస్తున్నారు, ఈ స‌మ‌యంలో ప్రసిద్ధ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా అధినేత జాక్ … భారత్ కు ఔషధాల రూపంలో సాయం అందిస్తున్నారు .

కరోనా నివారణకు ఉపయోగ పడే అనేక అత్యవసర ఔషధాలను జాక్ మా ఫౌండేషన్ , అలీబాబా ఫౌండేషన్ భారత్‌ తో పాటు మరో ఆరు దేశాలకు అందించాలని జాక్‌ మా నిర్ణయించారు . ఇక మ‌న‌దేశం భార‌త్ తో పాటు అజర్ బైజాన్ , భూటాన్ , కజకిస్తాన్ , కిర్గీస్థాన్ , ఉజ్బెకిస్తాన్ , వియత్నం వంటి దేశాలకు జాక్ మా సాయం చేస్తున్నారు.

భారత్ తో పాటు ఈ మొత్తం ఏడు దేశాలకు 17 లక్షల మాస్కులు , 1,65,000 టెస్టు కిట్లు , రక్షణ వస్త్రాలతో పాటు అనేక వెంటిలేటర్లు , ధర్మల్ గన్లు వంటి కీలకమైన వైద్య పరికరాలను అందజేయనున్నారు . ఇలా 23 దేశాల‌కు సాయం అందిస్తున్నారు.. ఇండియన్ రెడ్‌ క్రాస్ సంస్థకు ఈ వైద్య పరికరాలు , ఔషధాలను అందించ‌నున్నారు, ఇక అగ్ర‌రాజ్యం అమెరికాకి కూడా ఈ సాయం అందించారు.