భార‌త్ కు అదిరిపోయే సాయం చేసిన అమెరికా ? ఎంత ఇచ్చారంటే

భార‌త్ కు అదిరిపోయే సాయం చేసిన అమెరికా ? ఎంత ఇచ్చారంటే

0
80

అస‌లు ఈ క‌రోనా మ‌హమ్మారితో అత్య‌ధికంగా పాజిటీవ్ కేసులు న‌మోదు అవుతుంది అమెరికాలోనే అని చెప్పాలి.. దాదాపు ల‌క్ష పాజిటీవ్ కేసులు న‌మోదు అయ్యాయి.. ఇక న్యూయార్క్ న‌గ‌రంలో రోడ్ల‌మీద‌కి జ‌నం రావ‌డం లేదు ..ఇప్పుడు అత్యంత దారుణ‌మైన స్దితి అమెరికా అంతా ఉంది.

ఆర్మీ సిబ్బంది వాహ‌నాలు విమానాలు మిన‌హ మ‌రే వాహ‌నాలు రోడ్ల‌పై ఎమ‌ర్జెన్సీగా తిర‌గ‌డం లేదు, అయితే ఈ స‌మ‌యంలో కూడా అమెరికా మిగిలిన దేశాల‌కు సాయం చేస్తోంది, ఆర్దికంగా ఇబ్బంది ప‌డుతూ క‌రోనా వ‌ల్ల బాధ‌ప‌డుతున్న దేశాల‌కు సాయం అందిచింది అమెరికా.

అందులో మ‌న భార‌త్ కూడా ఉంది.అగ్రరాజ్యం అమెరికా 2.9 మిలియన్‌ డాలర్లను మ‌న దేశానికి సాయంగా ప్రకటించింది. ఈ మొత్తం విలువ భారత కరెన్సిలో 21కోట్లు. కరోనా కట్టడికి ఇప్పటికే అమెరికా భారత్‌కు వంద మిలియన్‌డాలర్ల ప్యాకేజిని ప్రకటించింది. క‌రోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు 174 మిలియన్‌ డాలర్లను అమెరికా ప్రకటించింది. వీటిని క‌చ్చితంగా క‌రోనా ఫైట్ కోసం వాడుకోవాలి అని అక్క‌డ అధికారులు తెలిపారు.