దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది, ఈ సమయంలో ఉపాధి లేక చాలా మంది ఇంటికి పరిమితం అయ్యారు, అయితే ఈ వైరస్ దాని తీవ్రత మరింత పెంచుకుంటోంది, చాలా మంది దేశంలో వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు కంపెనీ అధినేతలు ఉన్నత ఉద్యోగులు సినిమా నటులు కరోనాపై యుద్దానికి తమ వంతుగా విరాళాలు అందించారు.
పేదలను ఆదుకునేందుకు దేశానికి సాయంగా పీఎం కేర్స్ కు విరాళం అందచేశారు. తాజాగా కూల్ డ్రింక్స్ కంపెనీ పెప్సికో కూడా కరోనాపై పోరుకు సాయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా 25వేల కొవిడ్-19 పరీక్షా కిట్లు, 5 మిలియన్ల భోజనాలు అందించనుంది.
ఈ 21 రోజుల లాక్‌డౌన్‌తో ఆహారం దొరక్క అలమటిస్తున్న 8 వేలమంది అభాగ్యులకు అక్షయపాత్ర ఫౌండేషన్ భాగస్వామ్యంతో వండిన ఆహార పదార్థాలను అందించనున్నట్టు పెప్సికో ఇండియా తెలిపింది.
అంతేకాదు ఉద్యోగుల ద్వారా కొంత విరాళం సేకరిస్తామని తెలిపింది.