ఇండియాలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన బంగారం ధరలు

ఇండియాలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసిన బంగారం ధరలు

0
93

పసిడి ధర భారీగా పెరిగింది ..అనుకున్నట్లే జరిగింది గత ఏడాది అందరూ అన్నారు జనవరిలో బంగారం ధర భగ్గుమంటుంది అని అలాగే పెరిగింది.. సోమవారం ధరలు సరికొత్త రేటుకి చేరుకున్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.720 పెరిగి రూ.41,730కి చేరుకుంది. పుత్తడితోపాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర రూ.1,105 పెరుగుదలతో రూ.49,430కి చేరుకుంది. దేశంలో ఇదే ఆల్ టైం రికార్డు అంటున్నారు వ్యాపారులు.

ముంబై మార్కెట్లో బంగారం రూ.750 పెరిగి రూ.40,842కి, వెండి రూ.625 పెరిగి రూ.47,955 కి చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం రూ.40,980, కేజీ సిల్వర్ రూ.48,300 పలికింది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణమే ఇందుకు ప్రధాన కారణమని బులియన్వర్గాలంటున్నాయి.

చాలా మంది ఇన్వెస్టర్లు బంగారం పై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ సమయంలో షేర్లపై మార్కెట్లో ప్రతికూల స్దితి కనిపిస్తోంది, అందరూ బంగారం పై ఇన్వెస్ట్ చేయడంతో పుత్తడి పరుగులు పెడుతోంది.ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్సు (31.1గ్రాములు) బంగారం ఒక దశలో 1,588 డాలర్లకు పెరిగింది.