భారత్ – పాక్ వాఘా సరిహద్దు గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

భారత్ - పాక్ వాఘా సరిహద్దు గురించి మీకు ఈ విషయాలు తెలుసా ?

0
100

వాఘా మనకు పాక్ కు మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతం… భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న సరిహద్దును దాటే రహదారి సమీపంలో ఉన్న గ్రామం ఇది, ఇక్కడ నుంచి సరుకు రవాణా టర్మినల్, రైల్వే స్టేషన్ ఉంటుంది.

భారతదేశంలోని అమృత్సర్, పాకిస్తాన్లోని లాహోర్ నగరాలను కలిపే గ్రాండ్ట్రంక్ రోడ్డుపై ఈ గ్రామం నెలకొని ఉంది.వాఘా సమీపంలో భారత పాకిస్తాన్ సరిహద్దులో జాతీయ పతాకం అవనతం చేసే కార్యక్రమం నిత్యం జరుగుతుంది.

భారత్-పాక్ సరిహద్దు లాహోర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలోను, అమృత్సర్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరిహద్దు ప్రాంతం అట్టారి గ్రామానికి మూడు కిలోమీటర్ల సమీపంలో ఉంది. భారత్ పాక్ లో ప్రజలకు బాగా తెలిసిన సరిహద్దు ప్రాంతం, 1947లో దేశవిభజన సమయంలో భారతదేశంలోని అనేక మంది ముస్లిం ప్రజలు ఈ ప్రాంతం నుండే పాకిస్తాన్ దేశానికి వలస వెళ్ళారు. పాకిస్తాన్ ప్రజలు ఈ ప్రాంతాన్ని వాఘా బార్డర్ అని పిలుస్తారు.