భారత్, పాక్ యుద్ధమే వస్తే…

ఎవరి బాలలు ఎంత..? ఎవరి సత్తా ఎంత?

0
135

జమ్మూ కాశ్మీర్ స్వాతంత్ర్య ప్రతిపత్తిని కేంద్ర రద్దు చేసిన అనంతరం సరిహద్దుల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి భారత్, పాకిస్థాన్ల మధ్య రోజు రోజుకు మాటల యుద్ధం పెరిగిపోతుంది. అన్వయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మంచిది కాదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిస్తుంటే.. మరోవైపు రైల్వెశాఖ మంత్రి షేక్ రషీద్ మాత్రం అక్టోబర్, నవంబర్లో భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధమే జరుగుతుందని. ఇక అదే ఆఖరి యుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.

గుజరాత్ సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకు వచ్చి విద్వంషం సృష్టించే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. పాక్, భారత్ మధ్య యుద్ధం వస్తే ఎవరి బాలలు ఎంత?.. ఎవరి సత్తా ఎంత? అన్న ఆసక్తిని రేపుతోంది.

భారత్ దగ్గర 3 , 000 కి. మీ. నుంచి 5 ,000 దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించే అగ్ని -3 సహా తొమ్మిది రకాలైన బాలిస్టిక్ క్షిపణిలు ఉన్నాయి. పాకిస్తాన్ చైనా సహకారంతో క్షిపణుల్ని అభివృద్ధి చేసింది. తక్కువ, మధ్య తరహా దూరంలో ఉన్న క్షిపణిలు, 2 , 000 కి. మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించే షాహిన్ -2 క్షిపణి పాక్ దగ్గర ఉంది.