రైతుల కోసం కేంద్రం మరో కొత్త స్కీమ్ – రూ.15 లక్షలు

0
84

మనం మూడు పూటలా తిండి తింటున్నాం అంటే దానికి రైతే కారణం. ఆ రైతు పంట పండించకపోతే మనకు తినడానికి ఆహారం కూడా ఉండదు. అందుకే రైతే దేశానికి వెన్నుముక అంటారు. మన దేశంలో మోదీ సర్కారు రైతులకు సాయం చేయడానికి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పలు పథకాలను తీసుకొచ్చింది. పీఎం కిసాన్ నిధి, ఫసల్ బీమా వంటి పథకాలు ఇప్పటికే అమలు చేస్తున్నారు.

రైతులు దీని ద్వారా ప్రతిఫలం పొందుతున్నారు. తాజాగా రైతుల కోసం కేంద్రం మరో పథకాన్ని తీసుకొచ్చింది. అదే పీఎం కిసాన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ స్కీమ్ యోజన (PM Kisan FPO) ఈ పథకం ద్వారా రైతులు నేరుగా వారే అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. వారికి మోదీ సర్కార్ రూ.15 లక్షల ఆర్థిక మద్దతు అందిస్తుంది.

పీఎం కిసాన్ ఎఫ్పిఓ పథకం కింద రైతు ఉత్పత్తి సంస్థకు రూ.15 లక్షలు ఇవ్వనున్నారు.11 మంది రైతులు కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కంపెనీగా రిజిస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా వచ్చే డబ్బులను విత్తనాలు, మందులు, ఎరువులు, ఇతర పరికరాలు మీరు రైతులకు అమ్ముకోవచ్చు. దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలో కేంద్రం విడుదల చేయనుంది.