కేంద్రం గుడ్ న్యూస్ 30 సెకన్ల వీడియో తీయండి – రెండు లక్షల ఫ్రైజ్ మనీ గెలవండి

good news smoking videos indian government

0
87

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది…. అయితే కచ్చితంగా దీని గురించి ఔత్సాహికులు తెలుసుకోవాలి, అది ఏమిటి అంటే …కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా రెండు కాంటెస్ట్ లు పెడుతోంది, ఇందులో గెలిచిన వారికి భారీ ఫ్రైజ్ ఇస్తోంది. అయితే దీనికి ఏం చేయాలి అనేది చూస్తే.

పొగాకు వల్ల కలిగే నష్టాలపై ఒక చిన్న వీడియో తీయాలి. 30 సెకన్ల నుంచి 60 సెకన్ల నిడివి ఉంటే సరిపోతుంది. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు ఈ పోటీలో పాల్గొనాలి అంతకంటే చిన్నవారికి ఎంట్రీ లేదు…ఇందులో ఫస్ట్ ఫ్రైజ్ వస్తే వారికి రూ.2 లక్షలు, సెకండ్ ప్రైజ్ కింద రూ.1.5 లక్షలు, మూడో ప్రైజ్ కింద రూ.లక్ష అందిస్తారు.

అంతేకాదు మరో పది మందిని సెలక్ట్ చేసి వారికి 10 వేల చొప్పన ఫ్రైజ్ మనీ అందిస్తారు. మీకు ఇంట్రస్ట్ ఉంటే వెంటనే ఈ వెబ్ సైట్లో వివరాలు చూడండి…జూన్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే ఆ వెబ్ సైట్ లింక్

https://www.mygov.in/task/short-film-making-contest

అలాగే దీనిపై వ్యాస రచన పోటీలు ఉన్నాయి వారు ఈ వెబ్ సైట్లో వివరాలు చూడవచ్చు.

https://www.mygov.in/task/essay-writing-competition/