గతంలో విదేశాలకు వెళ్లడం అంటే పెద్ద ప్రయాస… కాని ఇప్పుడు గంటల్లోనే విదేశాలకు వెళుతున్నారు.. ఉదయం ఇక్కడ ఉంటే సాయంత్రం వేరే దేశంలో ఉంటున్నారు.. కనెక్టివిటీ పెరిగింది గ్లోబలైజేషన్ ద్వారా భారీగా ఉద్యోగాలు వస్తున్నాయి.. అందుకే తమ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నవారు చాలా మంది ఉంటున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో నివసిస్తున్న జనాభాలో భారత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మన వారు చాలా మంది విదేశాల్లో ఉంటున్నారు, దాదాపు ఈ సంఖ్య ఎంతో తెలుసా అక్షరాలా 1.80 కోట్లుగా ఉంది.
వీరు అందరూ వివిద దేశాల్లో నివశిస్తున్నారు, ఇలా మరే దేశంలో ఇంత మంది ఇతర దేశాలకు వెళ్లి నివశిస్తుంది లేదు అనే చెప్పాలి.
యూఏఈ, అమెరికా, సౌదీ అరేబియా దేశాల్లో మన వారు నిశిస్తున్నారు, ఇక మన తర్వాత మెక్సికో ఉంది వారు కోటి పదిలక్షల మంది ఉన్నారు, ఇక రష్యా కోటి పది లక్షల మంది ఉన్నారు, చైనా కోటి మంది సిరియా 82 లక్షల మంది…. మన దేశం నుంచి ఎక్కువగా యూఏఈలో 35 లక్షల మంది ఉన్నారు.. తర్వాత అమెరికా 27 లక్షల మంది ఉన్నారు.. అమెరికాలో దాదాపు 5 కోట్ల మంది ఇతర దేశాల వారు ఉంటున్నారు.
.