Video: జడివానలో వైఎస్ షర్మిల దీక్ష

0
92

తెలంగాణలో YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరంలో పర్యటిస్తుండగా గాయకుడు ఏపూరి సోమన్న పై దాడి కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ షర్మిల కార్యకర్తలతో ఆందోళన చేపట్టారు.

భారీ వర్షంలో కూడా ఆమె పట్టువిడవకుండా ఆందోళనతో నిరసన తెలుపుతున్నారు. మఠంపల్లి మండలం తెరాస పార్టీ నేతలను అరెస్ట్ చెసే వరకు దీక్ష విరమించే లేదని భీష్మించుకు కూర్చున్నారామె. నిందితులను కస్టడీ లోకి తీసుకొనే వరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు. మాకు మీ పోలీసుల మీద నమ్మకం లేదు. మీ ఎంక్వైరీ మీద నాకు నమ్మకం లేదు. కళ్ళముందు దాడి జరిగితే చర్యలు ఎందుకు ఆలస్యం చేస్తారని షర్మిల మండిపడ్డారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి

https://www.facebook.com/rajashekar.konda.351/videos/762554408087589