ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సెంచరీ కొట్టక ముందే ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతున్నాయి… ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులకు జగన్ అభ్యర్థులను ఫిక్స్ చేశారు…. వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు…దాంతో పార్టీలో అసంతృప్తి వ్యక్తం అవుతుంది..
పాదయాత్రలో, ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కారని అంటున్నారు… హామీ ఇచ్చిన వారికీ కాదని ఈ ఎన్నికల్లో ఓటమి చెందిన వారికీ , ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికీ పదవులు ఇచ్చారని మండిపడుతున్నారు…
చంద్రబాబు నాయుడు కుమారుడిని ఓడించేందు చేనేత కులస్తులకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అలాగే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని గెలిపిస్తే ఆయన్ను తన కెబినెట్ లో తీసుకుంటానని చెప్పు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అందుకే ప్రస్తుతం పార్టీలో అసంతృప్తు జ్వాలలు ఎగసి పడుతున్నాయి.