తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గడిచిన పది రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు, అంతేకాదు కోట్ల రూపాయల ఆస్ధినష్టం వచ్చింది, హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. తెలంగాణలో రూ.5000 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది, ఇక ఆస్తి నష్టం పంట నష్టం భారీగా జరిగింది, ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొందరు వరదల్లో కొట్టుకుపోయారు.
వరద తగ్గిన కొన్ని రోజుల తర్వాత మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇన్సూరెన్స్ కంపెనీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎవరైనా సరే బాధితులు ఈ విషయాల్లో క్లెయిమ్ అప్లై చేసుకుంటే వెంటనే అవి పరిష్కరించాలి అని తెలిపింది IRDAI.
ఇక ఇంటి పెద్దలు ఎవరైనా ఇంట్లో ఉన్నవారు ఎవరైనా ఇలా వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు లభించకపోతే వారికి డెత్ సర్టిఫికెట్లు పొందడం కష్టం. అలాంటి వారి విషయంలో క్లెయిమ్స్ చెల్లించే విషయంలో జమ్మూకాశ్మీర్ వరదల సమయంలో ఎలాంటి విధానాన్ని అవలంభించారో, ఇప్పుడు ఇదే విధానం ఫాలో అవ్వాలి అని తెలిపింది, ఈ నగదు క్లెయిమ్స్ లో ఏమైనా అనుమానాలు ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్రం, జిల్లాల స్థాయిలో సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని IRDAI ఆదేశించింది.