నగరంలో కురిసిన వర్షాలతో అతలాకుతలం అయింది పరిస్దితి …ఇంకా చాలా ప్రాంతాలు బురదమయంగా ఉన్నాయి, నీరు అంతా నెమ్మదిగా తగ్గుతోంది, ఇక వర్షం పేరు చెబితేనే హైదరాబాద్ ప్రజలు గజగజా వణికిపోతున్నారు.
వరదలో మునిగిపోయిన వెహికల్స్ షెడ్లకు చేరాయి. బైకులు, ఆటోలు, కార్లు అనే తేడా లేకుండా లోతట్టు ప్రాంతాల్లోని వెహికల్స్ అన్నీ చాలా వరకూ డ్యామెజ్ అయ్యాయి, అయితే రిపేర్ చేయించాలంటే వేళల్లో ఖర్చు అవుతోంది అంటున్నారు యజమానులు.
ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్స్ ఓనర్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు టైమ్కు పరిహారం చెల్లించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు, ఇలాంటి సమయంలో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు రూల్స్ పేరిట కొర్రీలు పెడుతున్నాయి.
టూ వీలర్లకు రూ.3 వేల నుంచి రూ.15 వేలు, ఆటోలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, కార్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతోంది. ఇక అందరికి ఎక్కువగా కార్లు బైకులకి ఇంజిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి
ఈ వరదల్లో దాదాపు 2.4లక్షల ఆటోలు, కార్లు, 5 లక్షల బైకులు నీటిలో మునిగాయని అంచనా.