ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు సంచలన నిర్ణయం

ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు సంచలన నిర్ణయం

0
114
AP Inter exams Schedule

ఏపీలో పరీక్షల సందడి నెలకొనబోతోంది, వచ్చే నెల అంటే మార్చి తోనే పదోతరగతి ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసన్ పీజీ పరీక్షలు వరుసగా జరుగుతాయి, అయితే
ఆంధ్రప్రదేశ్లో మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు…మార్చి 4 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

దీనిపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంబంధించ ఇంటర్ విద్యాశాఖ అధికారులతో చర్చలు జరిపారు, ఈ సమయంలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పకడ్భందీగా చేయాలని ఆయన ఆర్ఐవోలతో సూచించారు. జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగులు కూడా ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.

అయితే ఎక్కడ అవసరమో అక్కడ ముందుగా తెలిపి వారి సర్వీస్ ఉపయోగించుకోవాలి అని అన్నారు, అంతేకాదు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉన్నా అక్కడ కచ్చితంగా జిరాక్స్ షాపులు మూసివేయాలి అని చెప్పారు.చీఫ్ సూపర్ వైజర్ మినహా మరెవరూ పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వాడకూడదు అని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఇబ్బంది వస్తోంది కాబట్టి ఇప్పుడు గ్రేడింగ్ తో పాటు మార్కులు కూడా ఇవ్వనున్నారు.