గతంలో ప్రేమ లేఖ అంటే పెద్ద లెటర్లు రాసేవారు.. తర్వాత గ్రీటింగులు వచ్చాయి ఇప్పుడు అయితే అసలు ఇలా ఏమీ లేదు నేరుగా ఓ వాట్సాప్ మెసేజ్ ద్వారా తమ ప్రేమని కవితల రూపంతో తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు, తమ ప్రేమని తెలియచేస్తున్నారు, ఇలా చాలా మంది తమ ప్రేయసికి తమ ప్రేమని చెబుతున్నారు..
తాజాగా ఓ ఇంటర్ కుర్రాడు తన ప్రేయసికి లవ్ ప్రపోజల్ పెట్టాడు.. దానికి ఆమె ఇచ్చిన సమాధానం వింటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్ధి తన ప్రేమను ఇలా తెలిపాడు.
నేను ఢిల్లీకి చెందిన అబ్బాయిని.. నేను ఇంటర్ చదువుతున్నాను.. నువ్వు చాలా అందంగా ఉన్నావు.. నాకు నచ్చావు..
నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడిగాడు.
నా తండ్రికి ఇక్కడ చాలా పెద్ద షిప్పింగ్ వ్యాపారం ఉంది. నేను నీ కోసం ఏదైనా చేస్తాను. కానీ దయచేసి, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి అవుతావా అని ప్రపోజ్ చేశాడు, దీనికి ఆ అమ్మాయి కూడా అంతే స్టైట్లో సమాధానం ఇచ్చింది..దయచేసి పాఠశాల తెరవండి
అని చెప్పింది…అంతేకాదు నేను ఇలాంటివి పెద్ద పట్టించుకోను నీ లేఖని పట్టించుకోవడం లేదు అని సమాధానం ఇచ్చింది, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది.