మన దేశంలో పెళ్లిళ్లు అంటే వందలమంది బంధుమిత్రులు హాజరవుతుంటారు, కాని ఈ కరోనాతో పెళ్లి అంటే కేవలం పదుల సంఖ్యలోనే వస్తున్నారు అందరూ..ప్రభుత్వాలు పెళ్లిళ్లకు కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని కొన్ని నిబంధనలు కూడా పెట్టాయి. కరోనా కేసులు పెరుగుతాయి అని హెచ్చరిస్తున్నారు, దీంతో పెళ్లికి వచ్చేవారు కూడా తగ్గిపోతున్నారు.
కాని ఇక్కడ ఒక పెళ్ళికి మాత్రం ఏకంగా పది వేల మంది హాజరు కావడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది… మరి ప్రభుత్వం ఏమీ చేయలేదా అంటే ఈ స్టోరీ చదవాల్సిందే..మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో అక్కడి మాజీ మంత్రి టెంగ్కూ అద్నాన్ కుమారుడి పెళ్ళికి ఏకంగా పది వేల మంది హాజరయ్యారు. అన్నీ నిబంధనలు పాటించి ఈ పెళ్లి చేశారు.
పెళ్లికి వచ్చిన బంధువులంతా తమ తమ కార్లలోనే కూర్చుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు రోడ్ సైడ్ కల్యాణ మండపం దగ్గర నిలబడి ఉన్నారు, అందరూ కారు నుంచి వారికి విషెస్ చెప్పారు. ఇక భోజనాలు కూడా అందరికి పార్శిల్ చేసి కారులో అందించారు, ఈ పెళ్లి మాత్రం ఆ దేశంలోనే వైరల్ గా మారింది ఈ ఫోటోలు కూడా.