ఇంటికి మ‌ద్యం డోర్ డెలివ‌రీ ఇక్క‌డ నుంచి ప్రారంభం

ఇంటికి మ‌ద్యం డోర్ డెలివ‌రీ ఇక్క‌డ నుంచి ప్రారంభం

0
112

మ‌న దేశంలో ఈ లాక్ డౌన్ తో ఏకంగా 40 రోజులు మద్యం షాపులు తెర‌చుకోలేదు, దీంతో అంద‌రూ ఇంటిప‌ట్టున ఉన్నారు, కాని కేంద్రం స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో మ‌ద్యం షాపులు తెర‌చుకున్నాయి, దీంతో పెద్ద ఎత్తున మ‌ద్యం షాపుల ముందు క్యూ క‌ట్టారు మందుబాబులు, అంతేకాదు దీని కోసం తెల్ల‌వారు జాము నుంచి క్యూ క‌ట్టారు.

అయితే ఇంత‌లా మందుబాబులు క్యూ క‌డితే ధ‌నవంతులు ల‌గ్జ‌రీగా ఎవ‌రో ఒక‌రి ద్వారా మ‌ద్యం తెప్పించుకునేవారు, కాని ఇప్పుడు నేరుగా ఇంటికి డోర్ డెలివ‌రీ రానుంది మ‌ద్యం…ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గి జొమాటోలు రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి కేంద్రం ఓకే చెప్పింది.

ఆహ‌ర‌మే కాదు ఇక మ‌ద్యం కూడా డెలివ‌రీ ఇవ్వ‌నున్నాయి, ముందుగా జార్ఖండ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. జార్ఖండ్ రాజధాని రాంచీలో ఇవాళ మద్యం హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించాయి. ఇక యాప్ లో కొత్త‌గా వైన్ షాప్స్ అనే ఆప్ష‌న్ పెట్టారు, సో ఇక మ‌ద్యం ఇంటికి డెల‌వ‌రీ వ‌స్తుంది, దీని తర్వాత మిగిలిన రాష్ట్రాల‌లో ఇది ప‌ర్మిష‌న్ ఇస్తే అమ‌లు చేస్తార‌ట‌.