ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాలి… ప్రజలకు ఏ అవసరం వచ్చినా వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపే బాధ్యత ప్రజాస్వామ్య నాయకుడిది… అయితే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు తమ నియోజకవర్గానికే పరిమితం అయ్యారనే టాక్ వినిపిస్తోంది…
మరికొంత మంది మంత్రులు ఉంటే తమ నియోజకవర్గంలో లేదంటే హైదరాబాద్ లో ఉంటున్నారు… ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం నెలకొందట… అందుకే మంత్రి హోదాలో కొంతమంది నేతల ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తుంటే వారి రాకను వ్యతిరేకిస్తున్నారట ఎమ్మెల్యేలు…
నియోజకవర్గాల పర్యటలో భాగంగా శంకుస్థాపనలను కూడా ఎమ్మెల్యేలు పోస్ట్ పోన్ చేయిస్తున్నారట… దీనిపై మంత్రులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారట… దీనిపై అధిష్టానం కూడా సీరియస్ అయిందట..