ఇరాన్ పై సంచలన ప్రకటన చేసిన అమెరికా భయం గుప్పిట్లో ఇరాన్

ఇరాన్ పై సంచలన ప్రకటన చేసిన అమెరికా భయం గుప్పిట్లో ఇరాన్

0
109

ఇరాన్ తోకజాడిస్తే కత్తిరిస్తాం అంటోంది అమెరికా.. మాపై దాడి చేయాలి అని భావిస్తే మరింత రెచ్చిపోతాం అనేలా కామెంట్లు చేస్తున్నారు ట్రంప్. గత శుక్రవారం ఇరాక్ విమానాశ్రయంపై రాకెట్ దాడి చేసిన అమెరికా.. ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసిం సులేమానీని హతమార్చింది.

తమ భూభాగంపై సులేమానీని అమెరికా హతమార్చడంపై ఇరాక్ మండిపడుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉన్న వేలాది మంది అమెరికా సైన్యం ఇరాన్ నుంచి బయటకు వెళ్లాలి అని చెపుతోంది, ఇక పార్లమెంట్ లో దీనిపై బిల్లు పాస్ చేశారు ఏకగ్రీవ తీర్మాణం చేశారు అయితే దీనిపై అమెరికా సీరియస్ అయింది.

ఇరాక్ తీర్మానంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. వెళ్తాం కానీ .. ఇరాక్‌పై పెట్టిన సైనిక ఖర్చును ఇచ్చేస్తే అలాగే వెళ్లిపోతామని చెప్పారు. ఇరాక్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని, ఆనగదు మొత్తం తిరిగి ఇవ్వాలి అని ఆయన తెలియచేశారు..