బర్త్ సర్టిఫికెట్ కావాలి అన్నా మరణాలకు సంబంధించి దృవీకరణ సర్టిఫికెట్ కావాలి అన్నా కచ్చితంగా ఆధార్ ఇప్పటి వరకూ ఇస్తూనే ఉన్నాం, అయితే జనన, మరణ ధ్రువీకరణ పత్రాల నమోదుకు ఆధార్ తప్పనిసరికాదని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తాజాగా ఆర్ టీఐ ద్వారా ఈ ప్రశ్నను అడిగితే, దీనికి సమాధానం వచ్చింది.
ఆధార్ను సమర్పించడం సభ్యుల ఇష్టం అని ఒక సర్క్యులర్ను గతవారం ఆర్జిఐ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ఒక వేళ సమర్పించిన్పటికీ.. ఆధార్ నెంబర్ను ఏ పత్రంలోనూ ముద్రించకూడదని వెల్లడించారు.
అంతేకాదు ఈ సర్క్యులర్ను జనన, మరణాలను నమోదు చీఫ్ రిజిస్ట్రార్లకు పంపుతామని తెలిపింది…కాని ఈ నిర్ణయాన్ని అమలు చేయడం వద్దు అనేది స్టేట్స్ కేంద్రపాలిత ప్రాంతాల నిర్ణయం బట్టీ ఉంటుంది అని తెలిపింది.