ఇటీవల ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అర్ధాంగి తమ్మినేని వాణీశ్రీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని తొగరం సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వైసీపీ తరపున ఆమె ఇక్కడ పార్టీ బలపరిచిన అభ్యర్దిగా ఏకగ్రీవం అయ్యారు.
ఇక తాజాగా ఆమె పంచాయతీ పరిధిలోని విద్యార్దులకి అందిస్తున్న మధ్యాహ్న భోజనం స్వయంగా పరిశీలించారు.. అక్కడ పిల్లలతో మాట్లాడారు…ఇంత దారుణంగా ఫుడ్ పెడుతున్నారా అని ఆమె సీరియస్ అయ్యారు.. సంబంధింత అధికారులకు ఫోన్ చేసి చెడామడా వాయించేశారు. ఇలాంటి ఫుడ్ మీరు తింటున్నారా నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం ఇలాంటి అన్నం తింటున్నారా.
ఇదేం అన్నం అని ప్రశ్నించారు.. మీ హెడ్ ని రమ్మను ఇది తింటారేమో ఇక్కడ ఉంటాను అని అడిగారు, నీ పై కంప్లైంట్ ఇస్తాను అని ఆమె నిప్పులు చెరిగారు, ఇలాంటి ప్రజా సేవ చేసేవారు మాకు కావాలి అని ఆమెని అందరూ అభినందిస్తున్నారు.
ఆ వీడియో మీరు చూడండి.
- Advertisement -
|
|
|