మనకి కలలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు, అయితే ఇది అందరికి ఏదో ఓ సమయంలో ఎదురు అవుతూనే ఉంటుంది, మంచి స్వప్నాలు రావాలి అని చాలా మంది కోరుకుంటారు.. అయితే కొన్ని వస్తువులు మనకు కలలో వచ్చినా కొన్ని జంతువులు మనకు కలలో కనిపించినా మంచి జరుగుతుంది అంటారు పండితులు.
కలలో పక్షి, జంతువులు కనిపించడాన్ని మంచి పరిణామంగా భావిస్తున్నారు. మనకు ఏ జంతువు కనిపిస్తే దానికి ఓ మంచి లేదా చెడు అనేది చెబుతారు, మరి మనకు కలలో కనిపించే వాటి బట్టి ఏది మంచి చెడు కల అనేది చూద్దాం.
నాట్యం చేస్తున్న నెమలి ఇలా ఉంటే మంచి జరుగుతుంది అని అర్దం
కాకి డేగ గబ్బిలం ఏదో కీడు జరుగనుంది అని సూచన
కలలో గుర్రం కనిపిస్తే అదృష్టం కలిసి రానుంది
గుర్రపు స్వారీ అయితే మీకు ధనలక్ష్మీ రానుంది
గోవు కనిపిస్తే లక్ష్మీ కటాక్షం వస్తుంది
కుక్క కనిపిస్తే గొడవలు వివాదాలు
ఏనుగు కనిపిస్తే గౌరవం రానుంది
ఇక పిల్లి కనిపిస్తే మీకు చెడు జరుగనుంది అని అర్డం
కలలో చీమ కనిపిస్తే మీరు ఆర్థికంగా మంచి జరుగుతుంది అని అర్దం.