రాత్రి పబ్ లో మా కుమారుడు లేడు?

0
105

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అందులో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.

కానీ ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదని  వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నాం అని పేర్కొన్నారు.