వైయస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్..పీకే హ్యాండివ్వడమే కారణమా?

Is the reason for the break for Yves Sharmila's pilgrimage?

0
100

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తాను చేపట్టిన పాదయాత్రకు పుల్ స్టాప్ పెట్టనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తుంది ఆమె సన్నిహితుల నుంచి. అయితే పాదయాత్ర ఎందుకు ఆపుతున్నారు అనే అంశంపై మాత్రం భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆమె చేపట్టిన పాదయాత్రను ఆపుతున్నట్లు షర్మిల వెంటనే ప్రకటించకపోవచ్చునని..కానీ ఏదో ఒక సాకుతో ఈ పాదయాత్రను మాత్రం ఆమె వాయిదా వేయడం తథ్యం అని వారు స్పష్టం చేస్తున్నారు. తన పాదయాత్రను ఇకపై షర్మిల తిరిగి ప్రారంభించకపోవచ్చునని ఆమె సన్నిహితులు బల్లగుద్దీ మరీ చెబుతున్నారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానంటూ వైయస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన అంతగా ఉండడం లేదని ఓ సమాచారం. అయితే రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వైయస్ షర్మిల.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌లో ఒఫ్పందం చేసుకున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు. వైయస్ షర్మిల ఇప్పటి వరకు నడుచుకుంటుంది. కానీ అధికార టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ క్రమంలో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్. ఇటీవల తన ఢిల్లీ టూరులో భాగంగా ప్రశాంత్ కిషోర్‌తో భేటీ అయ్యారని సమాచారం. అందుకు వారి మధ్య ఒప్పందం కూడా జరిగినట్లు తెలుస్తోంది.