గత కొద్దిరోజులుగా శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో విద్యార్థులు, ప్రజల నిరసనల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నిరసనలో ప్రధాని పదవిని రాజీనామా చేయాలనీ తీవ్ర ఆరోపణలు వ్యక్తం కావడంతో ఎట్టకేలకు శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్స రాజీనామా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ కోతలు భారీగా పెరగడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం వల్ల ప్రధాన పదవికి మహింద రాజపక్స రాజీనామా చేయడం జరిగింది.