భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 26వ తారీకు అనగా గురువారం హైదరాబాద్ లో పర్యటించనున్న క్రమంలో అధికారక షెడ్యూల్ రిలీజ్ చేసారు. గురువారం మధ్యాహ్నం 1 .30 కి బేగం పేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని 1 .45 వరకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్ నిర్వహించి వివిధ అంశాలపై చర్చించనున్నారు. అది ముగిసిన తరువాత 1 .50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ఐఎస్‌బీకి చేరుకోనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో మోది పాల్గొన్న తరువాత మల్లి సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేటకు ప్రయాణం కానున్నాడు. ఆ తరువాత 4 .15 కు బేగం పేట్ నుండి చెన్నై కి బయలుదేరనున్నట్టు పీఎంవో అధికారక షెడ్యూల్ విడుదల చేసింది. అతను హైదరాబాద్ వచ్చే తరుణంలో పోలీసులు భారీ బందోబస్తుతో బయలుదేరనున్నట్టు సమాచారం తెలుస్తుంది.
ఏకంగా 2000 మంది తో పటిష్టమైన బందోబస్తు పోలీసులు ఏర్పాటు చేయడంతో పాటు..ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవానికి కూడా హాజరు అయ్యేలా ఏర్పాట్లు చేసారు. స్నాతకోత్సవం లో పాల్గొననున్న 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ప్రత్యేకంగా ఈ విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు..ఈఎస్బి, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసారు.