ఇస్రో మన అంతరిక్ష పరిశోధనా సంస్ధ గగన్ యాన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది… మరోసారి మన దేశ జెండాని అంతరిక్షంలో రెపరెపలాడించనుంది అనే చెప్పాలి .. అవును చంద్రయాన్ తో పాటు గగన్ యాన్ కూడా స్టార్ట్ చేసింది ఇస్రో…. 2022లో ప్రయోగం ప్రారంభం అవనుంది.గగన్ యాన్ ఇండియా తోలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం.దీనిని మన దేశం ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసుకుంది.
గగన్ యాన్ ప్రయోగానికి మొత్తం ఖర్చు రూ.10వేల కోట్లు చేస్తున్నారు ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములను ఇస్రో పంపనుంది. వీరికి రష్యాలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరు నలుగురు ఫురుషులు అని తెలుస్తోంది,
ఈ నలుగురిని భూమి నుండి 2000 కిలోమీటర్ల ఎత్తుకు పంపనున్నారు. వీరికి ఈ నెల 18 నుంచి రష్యాలో శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి పూర్తిగా రష్యాలో 11 నెలల శిక్షణ ఇస్తారు.
ఇక వ్యోమగాములకు స్పేస్ సూట్ లను కూడా తయారు చేస్తున్నట్లు టెక్నికల్ సిబ్బంది స్పేస్ సూట్ ఏజెన్సీ వారు చెబుతున్నారు, అంతేకాదు వీరి కోసం స్పెషల్ ఫుడ్ తయారు చేస్తున్నారు, అయితే ఇక్కడ మరో విషయం ఉంది. నలుగురిలో అంతరిక్షంలోకి ఒకరిని పంపుతారా ఇద్దరిని పంపుతారా అనేది తెలియాల్సి ఉంది.అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు కూడా తొలిసారి అంతరిక్షంలోకి ఒక్క వ్యక్తినే పంపాయట.అందుకే మన ఇస్రో కూడా ఆలోచన చేస్తోంది, ఇప్పటికే గగన్ యాన్ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు.