ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని వైసీపీ ఉద్యమాలు చేసిన రోజుల్లో లారీ ఇసుక రూ. పదివేల లోపే ఉంది.
నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడడానికి ఒక కారణం ఇసుక మాఫియా అనే అంటారు. పేరుకు ఉచితం అన్నా డ్వాక్రా మహిళల పేరిట కార్యకర్తలు అక్రమంగా సంపాదిస్తున్నా మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. ఇసుక మాఫియా గురించి ప్రతిపక్షంలో వున్నన్ని రోజులు ఉద్యమాలు చేసి ఊదరగొట్టిన వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా ఎటువంటి పాలసీ తేకపోవడం చాలా ఇబ్బంది కర పరిస్థితులకి దారి తీస్తోంది.