ఎన్నో ఆశలతో వారు వివాహం చేసుకున్నారు.. ఈ జంటను చూసి చూడముచ్చటి జంట అని అందరూ సంబర పడ్డారు,
వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు స్నేహితులు హాజరు అయ్యారు, అయితే ఆ ఆశలు కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్నాయి.. ఆ ఆనంద క్షణాలు 72 గంటల తర్వాత మాయం అయ్యాయి.
వివాహం అయిన తర్వాత మూడు రోజులు శోభనం జరిగింది, ఇక తర్వాత ఉదయం పెళ్లి కుమార్తె లేచింది కాని ఆమె భర్త లేవలేదు, అయితే ఏమైందా అని చూస్తే అతను మరణించాడు, ఎలాంటి అనారోగ్యం లేదు కాని ఇలా మరణించడంతో అందరూ షాక్ అయ్యారు, వధువు కన్నీరు మున్నీరు అయింది, ఇంకా కాళ్ల పారాణి ఆరకముందే భర్త మరణించాడు.
అయితే పోలీసులు వచ్చి కారణాలు అడిగారు.. ఇంట్లో వారికి కరోనా పరీక్షలు చేశారు పెళ్లి కుమార్తెకు.. అలాగే ఇంట్లో ఎనిమిది మందికి కరోనా సోకింది.. వరుడికి కూడా కరోనా ఉండి ఉంటుంది అని అనుమానిస్తున్నారు, మొత్తానికి ఈ విషాదకరమైన ఘటన కన్నీరు పెట్టిస్తోంది.