ఆ జిల్లాలో త్వరలో ఐటి హబ్..ప్రకటించిన ఐటి మంత్రి కేటీఆర్

0
92
KTR

ఇప్పటివరకు తెలంగాణలో ఐటి హబ్ లు అంటే గుర్తుకొచ్చేది హైదరాబాద్ మాత్రమే. భాగ్యనగరం చుట్టూ నలువైపులా అంతలా ఐటీ రంగం విస్తరించింది. ఇక తాజాగా సూర్యాపేటలో కూడా ఐటి హబ్ కొలువు దీరనుంది. జిల్లా కేంద్రంలో త్వరలో ఐటి హబ్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి.

స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేసిన కృషి ఫలించబోతుంది. ఈ మేరకు సూర్యాపేటలో ఐటి హబ్ ప్రారంభించబోతున్నట్లు అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటి మరియు పురపాలన శాఖామంత్రి కేటీఆర్ కాలిఫోర్నియాలో ప్రకటించారు. అందుకు గాను గ్లోబల్ ఐటి సంస్థతో పాటు మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.