ఆచార్య చాణక్య నీతి, పెద్దలు మనకు చెబుతూ ఉంటారు.. ఇప్పటీకీ అనేక చోట్ల దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు ఆయన చెప్పిన నీతి సూత్రాలు.. ఇప్పటికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు.. అందుకే చాణక్య నీతి గురించి అందరూ తెలుసుకుంటారు.. అయితే ఆయన చెప్పేవి కాస్త కఠినంగా ఉన్నా అన్నీ నిజాలే అని చెప్పాలి.
ముఖ్యంగా ఆయన చెప్పిన గొప్ప విషయాలలో ఒకటి మన నాలుకని అదుపులో ఉంచుకోవాలి.. ఎవరిమీద పడితే వారిపై ఏది పడితే అది వాగకూడదు.. మితంగా మాట్లాడేవాడు కాస్త గొడవలకు దూరంగా ఉంటాడు అందుకే మితం అన్నీంటికి ఉత్తమం.
మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై ఎప్పుడూ నోరు పారేసుకోరాదని, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదని చాణక్యుడు తెలిపారు.మనకు జన్మనిచ్చి మాట నేర్పిన తల్లిదండ్రులను ఎట్టి పరిస్తితుల్లో తిట్టకూడదు అంతేకాదు చెడుగా ఒక్కమాట అనకూడదు..ఎప్పుడు పరుష మాటలు అమ్మ నాన్న పై ప్రయోగించవద్దని తెలిపారు ఆయన.