ఆ శివుడు అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ప్రతీ సోమవారం ఆ శివయ్యకు అభిషేకం చేయిస్తూ ఉంటాం.. ఆ శివరాత్రి రోజు ఆ పరమశివుడికి భక్తులు అభిషేకం చేయిస్తారు.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది… ఈ రోజు భక్తి శ్రద్దలతో పూజిస్తారు, అయితే శివరాత్రి పూట పూజ ఎలా చేయాలి అనేది పండితులు ఏమి చెబుతున్నారో చూద్దాం.
మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం మంచిది, అయితే ఎలాంటి అనారోగ్యాలు సమస్యలు లేని వారు చేయడం ఉత్తమం అనేది మరువకండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉపవాసానికి దూరంగా ఉండాలి..శివరాత్రిరోజు ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేస్తే చాలా మంచిది.
స్వామిని ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ఇలా అభిషేకం చేస్తున్న సమయంలో ఆశివుడ్ని తలచుకుని ఈ మంత్రం జపించుకోవాలి.. ఇక ఇంట్లో ఉన్నా గుడిలో ఉన్నా ఎక్కడ జాగరణ చేసినా మంచిదే.. కాని ఆ సమయంలో శివుడ్ని తలచుకుని ఆయన కథలు చదవడం, ఆయన మంత్రాలు జపించడం మంచిది. ఇక ఆరోజు మీకు తోచిన దానిలో దానం చేస్తే ఎంతో మంచిది.
ReplyForward
|