సోమనాథ్ ఆలయం మన దేశంలో ఎంతో ప్రముఖమైన ఆలయం అనేది తెలిసిందే, అంతేకాదు ప్రతీ రోజు వేలాది మంది ఇక్కడకు వస్తూ ఉంటారు భక్తులు.. భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రం పశ్చిమ తీరంలో ఉంది… 12 జ్యోతిర్ లింగాలలో మొదటి లింగాన్ని ఇక్కడ స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి.
ఈ ఆలయ చరిత్ర చూస్తే మహ్మద్ ఘజినీ 17 సార్లు ఈ ఆలయాన్ని దోచుకున్నాడు. అలాగే 8 సార్లు కూల్చాడు. అయినా అనేక సార్లు మళ్లీ ఈ ఆలయం డవలప్ చేశారు…ఈ గుడిని ఏడాదికి సుమారు 10 లక్షల నుండి 20 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ ఆదాయం ఏడాదికి 10 కోట్ల వరకూ ఉంటుంది అని చెబుతున్నారు.
దాదాపు 20 మిలియన్ దినార్ల సంపదను ఘజినీ తీసుకెళ్లారు అని అంటారు, అంతేకాదు ఆలయం కాపాడాలి అని భావించిన 50 వేల మందిని చంపాడు అంటారు, ఇది ఎర్ర ఇసుకరాయితో కట్టబడిన భారీ నిర్మాణం.సోమనాథ్ ఆలయం ద్వారకకు సమీపంలో ఉంటుంది..ప్రస్తుత సోమనాథ్ ఆలయాన్ని 1947 నుండి 1951 మధ్య కాలంలో ఐదేళ్లలో నిర్మించారు…సోమనాథ్ ఆలయ గోడలపై బ్రహ్మ, శివుడు, విష్ణువుల శిల్పాలు ఉంటాయి..స్థల పురాణం ప్రకారం సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. శాపవశాత్తు తేజస్సు కోల్పోయిన చంద్రుడు ఇక్కడి సరస్వతీ నదిలో స్నానమాచరించి, తిరిగి తేజస్సును పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.