ఐటీ ఉద్యోగులు అంద‌రికి గుడ్ న్యూస్

ఐటీ ఉద్యోగులు అంద‌రికి గుడ్ న్యూస్

0
110

ఈ వైర‌స్ దెబ్బ‌కు మార్చి నుంచి అందరూ ఇంటి ద‌గ్గ‌రే ఉంటున్నారు.. చాలా వ‌రకూ సాఫ్ట్ వేర్ కంపెనీలు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ కాన్సెప్ట్ చేస్తున్నాయి.. ఉద్యోగులు అంద‌రూ ఇంటి ద‌గ్గ‌ర నుంచి ప‌ని చేస్తున్నారు ఇప్ప‌డు కంపెనీల‌కు వ‌చ్చి వ‌ర్క్ చేసే ఆలోచ‌న చేయ‌డం లేదు.

పైగా దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో వర్క్‌ ఫ్రం హోంను మరో నాలుగు నెలలు పెంచే దిశగా ఐటీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు ఈ విషయాన్ని ప్రకటించాయి. ఇక చిన్న కంపెనీలు స్టార్ట్ అప్ లు మిన‌హ మిగిలిన దిగ్గ‌జ సంస్ధ‌లు అన్నీ త‌మ ఉద్యోగుల‌కి ఈ విషయం చెప్పాయి.

అంతేకాదు వారికి ఇంటిలో నెట్ బిల్ , ప‌వ‌ర్ బిల్, అలెవెన్స్ బిల్ కూడా ఎక్స్ ట్రా ఇస్తున్నాయి, ఇక చాలా మంది వ‌ర్క‌ర్లు ఆఫీసు కంటే ఇంటి నుంచి బాగా వ‌ర్క్ చేస్తున్నారు అని కంపెనీలు చెబుతున్నాయి,
అమెజాన్‌ అక్టోబర్‌ 2 వరకు ప్రకటించగా.. 2020 ఏడాది చివరి వరకు ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోంను ప్రకటించింది.