విద్యాబుద్ధులు నేర్పుతున్న ఓ ట్యూషన్ టీచర్ దారుణంగా ఆలోచన చేసింది.. మూడనమ్మకాలు నమ్మింది. ఏకంగా దోషం పోతుంది అనే నమ్మకంతో స్టూడెంట్ ని పెళ్లి చేసుకుంది…ఇంకా ఇలాంటి మూడనమ్మకాలు విశ్వాసాలు నమ్మేవారు ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యం కలుగక మానదు.
జన్మకుండలిలో దోషం తొలగిపోతుందనే నమ్మకంతో 13 ఏళ్ల బాలుడిని ఓ టీచరమ్మ పెళ్లి చేసుకుంది… పంజాబ్లోని జలంధర్లో ఈ దారుణ ఘటన జరిగింది…బస్తీ భవ ఖేల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి స్దానికంగా ఇంట్లో ట్యూషన్లు చెబుతుంది అక్కడ పక్కన ఇళ్లవారు తమ పిల్లలని ఆమె దగ్గర ట్యూషన్ కు పంపిస్తున్నారు.
ఆ యువతికి ఎన్ని పెళ్లి సంబంధాలు వస్తున్నా ఒక్కటి కూడా కుదరడం లేదు. దీంతో పూజారిని కలిస్తే జన్మకుండలి దోషం పోవాలి అప్పుడు పెళ్లి అవుతుంది అని చెప్పారు పండితుడు… దీంతో ఆమె ట్యూషన్కు వచ్చే ఓ 13 ఏళ్ల బాలుడిని ఈ ఉత్తుత్తి పెళ్లికి వరుడిగా ఎంపిక చేసుకుంది. ఇక బాలుడు తాళికట్టాడు, ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు, కాని తర్వాత ఇంటిలో బాలుడు అసలు విషయం చెప్పాడు దీంతో పోలీసులకి ఫిర్యాదు చేశాడు అతని తండ్రి .