ఆఫ్గనిస్థాన్ పై అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే షాక్

It would be a shock to know how much America has spent on Afghanistan

0
86

ఆఫ్గనిస్థాన్ లో ఇప్పుడు తాలిబన్లు రెచ్చిపోతున్నారు . 20 ఏళ్లు అమెరికా పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఇప్పుడు అమెరికా సాధించింది ఏమీ లేదు అనే అంటున్నారు అంద‌రూ. ఇన్నాళ్లు లక్షల కోట్లు ఖర్చు చేసిన అమెరికా దీని వల్ల సాధించింది ఏమీ లేదు. అమెరికా శిక్షణ ఎంత? ఆర్ధికంగా, రక్షణ పరంగా అమెరికా ఇన్నాళ్లూ ఆఫ్గాన్ పై పెట్టిన ఖర్చు ఎంత అనేది తెలిస్తే నిజంగా షాక్ అవుతాము.

దాదాపు 20 ఏళ్లల్లో అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సుమారు 2 లక్షల కోట్ల డాలర్లు మన కరెన్సీలో రూ.148 లక్షల కోట్లు ఖ‌ర్చు చేసింది. ఆఫ్గనిస్థాన్ లో సైన్యానికి శిక్షణ ఇచ్చారు అలాగే ఆయుధాలు కోసం ఖర్చు చేశారు ఇవే సుమారు 6.5 లక్షల కోట్లు ఉంటుంది.

అగ్రరాజ్యానికి భారీగానే ప్రాణనష్టం సంభవించింది. ఈ 20 ఏళ్లల్లో చాలా మంది రక్షణ ఉద్యోగులని కోల్పోయింది. 2,448 మంది అమెరికా సైనికులు మరణించారు. ఇక నాటో దేశాల సైనికులు 1144 మంది మరణించారు.

ఆఫ్గాన్ పోలీసులు,

సైనికులు -66,000
ఆఫ్గాన్ పౌరులు- 47,245
జర్నలిస్టులు- 72
తాలిబన్లు, ఇతర ఉగ్రవాదులు- 51,191 మంది మరణించారు.