ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు

It would be a shock to know these things about Afghan President Ashraf Ghani

0
102

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది. దేశాన్ని కాపాడలేకపోయాడు పైగా రాజీనామా చేసి వెళ్లిపోయారు అని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే రక్తపాతాన్ని నివారించేందుకే వెళ్లిపోయానని ఆయన అంటున్నారు. ఈ మాట అంటున్న మీరు అసలు ఏం చేశారు అని ఆ దేశ ప్రజలు విదేశీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆయన గురించి ఎన్నో విషయాలు వస్తున్నాయి. మీడియాతో టీవీలో కనిపించడం తప్ప ఆయన ప్రజలతో నేరుగా మాట్లాడింది లేదు.

బాగా చదువుకున్న వ్యక్తి ఇక్కడ అధ్యక్షుడు కాకముందు అమెరికాలో విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. ఆఫ్ఘనిస్థాన్ సోవియట్ చేతిలో బందీగా ఉన్న 1980ల్లో న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు. ప్రపంచ బ్యాంకులో కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేశారు. అంతేకాదు 2001లో ఐరాస ప్రత్యేక సలహాదారుగా కాబూల్ కు వచ్చారు.

ఇక 2002 నుంచి 2004 వరకు హమీద్ కర్జాయి అధ్యక్షతన ఉన్న మధ్యంతర ప్రభుత్వంలో ఘనీ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. దేశంలో పన్నుల వ్యవస్ధ అలాగే కరెన్సీ ఈ విషయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అయితే కొంచెం అహంకారం ఉంది అని అంటారు .దీని వల్ల ఆయన ఎవరినీ దగ్గరకు రానివ్వరు. చదువుకునే సమయంలో పరిచయం అయిన రూలాను ఘనీ వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు పిల్లలు. ఆయనకు గతంలో కాన్సర్ వచ్చింది. దీంతో కడుపులో కొంత భాగం తీసేశారు. ఆయన ఎక్కువ ఫుడ్ తీసుకోరు మితంగానే తీసుకుంటారు.