ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణస్వీకారం

0
98
Eatala Rajender

హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈటల రాజేందర్ అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ఆయనతో సభాపతి పోచారం శ్రీనివాస్​ ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో తెరాస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్… ఏడోసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందడం విశేషం.

గతంలో తెరాస నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్..ఏడోసారి భాజపా అభ్యర్థిగా గెలుపొందారు. అక్టోబర్​ 30న ఉపఎన్నికలు జరగ్గా.. నవంబర్​ 2న ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​పై ఈటల 23,855 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.