ప్రభుత్వానికి సెర్ప్ ఉద్యోగుల జెఎసి వినతి

0
51

తమ సమస్యల పరిష్కారం కోసం సెర్ప్ ఉద్యోగుల జెఎసి తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. ఆ వినతిపత్రం తాలూకు టెక్ట్ దిగువన యదాతదంగా ప్రచురిస్తున్నాం. చదవగలరు.

విషయం: SERP హెల్త్ ఇన్సూరెన్స్ తక్షణమే అమలు చేయుట, ఈనెల 3నుంచి
రినేవల్ జరిగే తేదీ లోపు గ్యాప్ పీరియడ్ చెల్లింపులు చేయుటకు మనవి. 2015-16, 2017 & 2018 లలో ఇన్సూరెన్స్ రినేవల్ ఆలస్యం అవగా, గ్యాప్ పీరియడ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు SERP నుంచే చెల్లించారు.

పై విషయమై తమరి దివ్య సముఖమునకు చేయు మనవి ఏమనగా సెర్ప్ సిబ్బంది ఆరోగ్య బీమా ఈ అక్టోబర్ రెండవ తేదీ రోజు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఆరోగ్య బీమా రెన్యువల్ ప్రాసెస్ పూర్తి చేయాలని రెండు నెలల ముందే మా జేఏసీ తరఫున SERP కార్యాలయంలో వినతిపత్రం సమర్పించడం తోపాటు అడ్మిన్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ డైరెక్టర్ ను కలిసి విన్నవించడం సహా గౌ. తమ దృష్టికి లేఖ ద్వారా తీసుకురావడం కూడా జరిగిన సంగతి విదితమే.

ఈ నెల 3వ తేదీన SERP ఆరోగ్య భీమా కోసం కొత్త కంపెనీని ఫైనల్ చేస్తూ రూపాయలు ఐదు కోట్ల 45 లక్షలు చెల్లింపులు కూడా తమరు చేసి ఉన్నారు. కానీ గత సం. పాలసీ కవర్ చేసిన కంపెనీ వాళ్లు ప్రస్తుత కంపెనీ పై ఫిర్యాదు చేయడం తదుపరి న్యాయపరమైన కారణాల దృష్ట్యా పదిహేను రోజుల తర్వాత ప్రస్తుతం టెండర్ దక్కించుకున్న కంపెనీ వారు SERP చెల్లించిన ప్రీమియం డబ్బులు రెండు రోజుల క్రితం SERP కు తిరిగి వాపసు చెసినట్లు అధికారుల ద్వారా తెలిసింది.

ఈ నేపథ్యంలో తేదీ 2 అక్టోబర్ 2021 నుంచి ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న సెర్ప్ సిబ్బంది వైద్య ఖర్చులను సదరు కంపెనీ చేత చెల్లించడం గాని లేదా గత ఆనవాయితీ ప్రకారం గ్యాప్ పీరియడ్ డబ్బు SERP నుంచి చెల్లించడం గాని చేయాలని మొత్తం SERP ఉద్యోగుల తరఫున తమరికి విన్నవిస్తున్నాము.

గతంలో 2015లో తేదీ 17.11.2015 నుంచి తేదీ 07.02.2016 వరకు ఇలాగే ఇన్సూరెన్స్ రెన్యువల్ ప్రాసెస్ ఆలస్యం అయిన సందర్భంలో ఆ గ్యాప్ పీరియడ్ కు సంబంధించి రు.17.50 లక్షలు సెర్ప్ సిబ్బంది చికిత్స పొందిన బిల్లులు చెల్లించియున్నారు. అలాగే 2017 లో తేదీ.08.02.2017 నుంచి 18.09.2017 వరకు రినేవల్ నిలిచిపోగా ఈ సమయంలో చికిత్స పొందిన 354 మంది SERP సిబ్బంది కుటుంబాల సభ్యులకురూ. 1.34 కోట్లు పరిహారం చెల్లించారు. అలాగే 19.09.2018 నుంచి 02.10.2018 వరకు ఆసుపత్రిలో చేరిన సిబ్బంది, సభ్యులందరికీ రు.1.44లక్షలు చెల్లించారు.

కావున ప్రస్తుతం గౌరవ తమరు వ్యక్తిగతంగా ఈ అంశంపై జోక్యం చేసుకుని వెంటనే SERP ఆరోగ్యబీమా రెన్యువల్ చేయించాలని, అదే విధంగా గత ఆనవాయితీ ప్రకారం తేదీ 2 అక్టోబర్ 2021 నుంచి కొత్త బీమా అమల్లోకి వచ్చే తేదీ వరకు గ్యాప్ పీరియడ్ యొక్క సిబ్బంది ఆసుపత్రి ఖర్చులు చెల్లించి 4156 SERP కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలతో..
TS SERP Employees State Union’s JAC
కుంట గంగాధర్ రెడ్డి
ఎపూరి నర్సయ్య
మహేందర్ రెడ్డి
సుభాస్ గౌడ్