వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో షాక్.

0
78

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో వైయస్ కుటుంబంలో విషాదం అలముకుంది ఆయన ఎంతో కాలంగా వైయస్ కుటుంబంలో నమ్మిన వ్యక్తిగా ఉన్నారు.. సుమారు వైయస్ రాజారెడ్డి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి వరకూ అందరితో ఆయనకు అనుబంధం ఉంది, ఇప్పుడు జగన్ దగ్గర ఆయన పని చేస్తున్నారు.. సుమారు 30 సంవత్సరాలుగా వైయస్ కుటుంబంలో కలిసి ఉంటున్నారు ఆయన.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు అనే వార్త తెలియడంతో, సీఎం వైయస్ జగన్ అర్ధాంతరంగా దిల్లీ పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. .గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నారాయణ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ నుంచి నేరుగా కడప ఎయిర్పోర్టుకు అక్కడనుంచి నారాయణ స్వగ్రామానికి హెలీకాఫ్టర్ లో బయలుదేరతారు వైయస్ జగన్ .

ఈ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నారాయణ స్వగ్రామం అనంతపురం జిల్లా దిగువపల్లెకు చేరుకొని నారాయణ అంత్యక్రియలకు హాజరవుతారు. తిరిగి సాయంత్రం తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే ఆయన మరణంతో జిల్లా వైసీపీ నేతలు అందరూ కూడా దిగువపల్లెకు రానున్నారు ..దీంతో పెద్ద ఎత్తున నేతలు జిల్లా నాయకులు సీఎం రానుండటంతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు… ఈ కార్యక్రమం తర్వాత మరో రోజు హస్తిన పర్యటనకు జగన్ వెళతారు అని వైసీపీ నాయకులు చెబుతున్నారు.