నేను ఇలానే ఉంటా మారేది లేదు… జగన్

నేను ఇలానే ఉంటా మారేది లేదు... జగన్

0
76

నేను చూశాను…. నేను ఉన్నాను అంటూ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు… పాదయాత్రలో భాగంగా ఏలూరు సాక్షిగా ఆటో కారు డ్రైవర్లకు ప్రతీ ఏటా పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు

ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే వాహన మిత్ర పథకం ప్రారంభించారు గతంలో జగన్ ఎక్కడైతే ఈ హామీ ఇచ్చారో అక్కడే ఈ పథకం ప్రారంభించారు… అంతేకాదు కాకీ చొక్కాను వేసుకుని తాను అందరివాడనని నిరూపించుకున్నారు.

జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… సొంత ఆటో కారు ఉన్నవారికి ఏటా 10 వేల సాయం అందిస్తామని చెప్పారు. ఐదేళ్లలో ఒక్కొక్కరికి 50 వేల ఇస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా 173531 మంది లబ్ది పొందుతారని స్పష్టం చేశారు జగన్