ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు…. గండికోట ముంపువాసులకు పరిహారం కోసం 553 కోట్లను విడుదల చేశారు..
అదే విధంగా ఎన్నికల హామీల్లో భాగంగా అదనంగా ఇస్తామన్న పరిహారానికి కూడా ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసింది.. దీంతో ముంపు వాసులకు అధనంగా 3 లక్షల 25 వేల పరిహారన్ని విడుదల చేశారు.
అదనంగా పెంచిన మొత్తంతో కలిపి ముంపువాసులకు 10 లక్షల పరిహారం అందనుంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని గండికోట ముంపువాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ రైతు పక్షపాతిగా మరోసారి నిరూపించుకున్నారని ప్రశంశలు జల్లు కురిపిస్తున్నారు.